థర్మల్ వాచ్ అన్నది ఒక లాభాపేక్షలేని, రాజకీయేతరమైన వృత్తిగతమైన సిటిజన్ కన్స్యూమర్ & సివిక్ యాక్షన్ గ్రూప్ అనే సంస్థ ప్రయత్నంతో ఏర్పాటైంది. ఈ సంస్థ 1986 నుంచి వినియోగ మరియు పర్యావరణ అంశాలకు సంబంధించిన పౌరుల హక్కులను కాపాడేందుకు కృషి చేస్తోంది. పారదర్శకత, జవాబుదారీతనం మరియు నిర్ణయాలు తీసుకోవడంలో భాగస్వామ్యం ఉండే విధంగా మేలైన పరిపాలన కొనసాగేందుకు మేం కృషి చేస్తున్నాం.
- అధికార యంత్రాంగం మరియు పర్యావరణ విధానాలు మరియు నియమ నిబంధనలు మరియు థర్మల్ పవర్ ప్రాజెక్ట్స్ కు సంబంధించిన ఇఐఎ ప్రక్రియలోని చట్టాల గురించిన విభిన్న అంశాల సమాచారాన్ని ప్రచారం చేయడం మరియు అపోహలు తొలగించే కృషి ద్వారా ఇందులో భాగస్వామ్యం కలిగిన వారిని అత్యధికంగా చేరుకునేందుకు మరియు అవగాహన పెంచేందుకు కృషి చేయడం.
- వెబ్ సైట్, న్యూస్ లెటర్ మరియు ఆన్ లైన్ పోరమ్ వంటి మీడియా సాధనాల ద్వారా ఇంధనం, పర్యావరణం మరియు థర్మల్ పవర్ రంగాలకు సంబంధించిన సమాచారాన్ని ప్రచారం చేయడం.
- ఇఐఏ ప్రక్రియలో ప్రక్రియలో స్థానిక సమూహాలు మరియు ఎన్జీవోల వ్యవస్థను అభివృద్ధి చేయడం, శిక్షణ ఇవ్వడం మరియు సామర్థ్యాలను పెంపొందించడం. తద్వారా ప్రస్తుతం వాడుకలో ఉన్న టిపిపిల ప్రతికూల ప్రభావాలను పర్యవేక్షించడం మరియు తగ్గించేలా చేయడంతో పాటు ఉత్తమ ఆచరణలను ప్రతిపాదించగలిగేలా తయారు చేయడం.
- ఇఐఏ ప్రక్రియలో ప్రభుత్వ సంస్థలు పారదర్శకంగా మరియు జవాబుదారీతనంతో పని చేయడంలో తప్పనిసరిగా అనుసరించాల్సిన ప్రక్రియల అమలు సక్రమంగా ఉండేలా చూసుకోవడం.
- ప్రభావానికి గురైన సమూహాలకు ఇఐఏ ప్రక్రియలో భాగంగా చట్టపరమైన, ఆర్థికపరమైన మరియు సాంకేతికపరమైన సహకారాన్ని మరియు వృత్తినైపుణ్యంతో కూడిన సలహాలను ఇవ్వడం.