మేము ఏం చేస్తాము

  • దక్షిణ భారతదేశంలోని క్షేత్ర స్థాయి NGOs మరియు స్థానిక సమాజాల పరిసర ప్రాంతాలలో బొగ్గు ఆధారిత ప్లాంట్ల గురించి ఏవైనా ప్రకటనల గురించి వారికి తెలియజేయడం మరియు అభ్యర్థిస్తే ప్లాంటు యొక్క EIA సంబంధిత పత్రాలను వారికి ఇవ్వడం.
  • ఒక సాంకేతిక నిపుణుడు, పర్యావరణ లాయరు మరియు ఆర్థిక శాస్త్ర నిపుణుడు గల నిపుణుల జట్టును ఉపయోగించి ప్లాంటు కొరకు పర్యావరణ ప్రభావ అంచనా మరియు ప్రతిపాదించబడిన తీవ్రతను తగ్గించే చర్యల యొక్క సాంకేతిక అంచనాను నిర్వహించడం. ఈ అంచనా క్షేత్ర స్థాయి NGOsమరియు స్థానిక సమాజాలతో పంచుకోబడుతుంది దీనిని వారు ప్రతిపాదించబడిన/ఇదివరకే ఉన్న ప్లాంటు కొరకు పోరాటం చేయడంలో ఇన్‌పుట్స్ గా ఉపయోగిస్తారు.
  • ఇంగ్లీషు, తమిళం, తెలుగు, మలయాళం మరియు కన్నడ భాషలలో సమాచార కర పత్రాలు మరియు పోస్టర్ల యొక్క పంపిణీ ద్వారా EIA ప్రక్రియను గురించి NGOs మరియు స్థానిక సమాజాలలో అవగాహనను కల్పించడం.
  • థర్మల్ పవర్ ప్లాంట్ ద్వారా ప్రభావితం చెందిన/చెందబోయే సమాజాలు మరియు NGOs లకు EIA ప్రక్రియలలో ప్రతీ దశలో వారు జోక్యం చేసుకొని పాటించగల సంభావ్య వ్యూహాల గురించి వారిని తయారుచేయడం
  • దక్షిణ భారతదేశంలోని థర్మల్ పవర్ ప్లాంట్ల అభివృద్ధి గురించి Stoppwatchఅనే నెలసరి ఇ-న్యూస్ లెటరును ప్రచురించడం, ఇది పర్యావరణ మరియు వినియోగదారు సమూహం, గ్రామ ప్రతినిధులు మరియు మీడియా ప్రతినిధులతో పాటు దాదాపు 1000 సబ్‌స్క్రైబర్లకు చేరుతుంది.