EIA ప్రక్రియలో జోక్యం

  1. క్లుప్తంగా ప్రజాభిప్రాయ సేకరణ ప్రక్రియ
  2. నిర్మాణం & పద్ధతి; ప్రజాభిప్రాయసేకరణ ఉద్దేశం
  3. FAQs (తరచు వ్యక్తమయ్యే సందేహాలు)

క్లుప్తంగా ప్రజాభిప్రాయ సేకరణ ప్రక్రియ

ధర్మల్ పవర్ ప్రాజెక్ట్ తలపెట్టిన ప్రాంతంలో పర్యావరణానికి సంబంధించి స్థానిక ప్రజానీకం తమ సందేహాలను నివృత్తి చేసుకోవడానికిఅభ్యంతరాలు వ్యక్తం చేయడానికిన్యాయబద్ధమైన తమ హక్కులను ప్రభావితపరిచేటట్లయితే ప్రాజెక్టుపట్ల తమ వ్యతిరేకతను నమోదు చేయడానికి ప్రజాభిప్రాయ సేకరణ ఓ చక్కటి అవకాశం. ఇది ఆయా వర్గాలకు అందుబాటులో ఉన్న పెద్ద వేదిక. ఈ ప్రక్రియలో పాల్గొన్నవారి సంఖ్య మరియు సమర్థవంతమైన వాదన ప్రాతిపదికన ఫలితం ఆధారపడి ఉంటుంది. వారి సందేహాలుఅభ్యంతరాలునిరసనలు నమోదు చేయడమవుతుంది. ఇవన్నీ వాస్తవమేనని రుజువైన పక్షంలో ప్రాజెక్ట్ దరఖాస్తును నియత్రణాధికారులు తిరస్కరించడానికి అవకాశముంటుంది.

ప్రాజెక్ట్ ప్రతిపాదకుడు లెదా దరఖాస్తుదారు ముసాయిదా EIAని MoEFకి లేదా SEIAAకి పిసి నిమిత్తం అందజేస్తారు. అదే సమయంలో సంబంధిత SPCBకికూడా పిసి ప్రక్రియ నిమిత్తం లేఖ అందజేస్తారు.

 

లేఖ అందిన 45 రోజులలోగా పిసి ప్రక్రియను SPCB తప్పనిసరిగా పూర్తి చేసి, MoEF/SEIAAకి నివేదిక సమర్పించాలి. ఒకవేళ కాల పరిమితిలోగా పిసి ప్రక్రియను పూర్తిచేయలేనట్లయితే, ప్రజాభిప్రాయ సేకరణకు MoEF/SEIAA మరో ఏజెన్సీని నియమించవచ్చు.

 

ప్రాజెక్ట్ ప్రతిపాదకుడు/ దరఖాస్తుదారు ఇవన్నీ పరిగణనలోకి తీసుకుని ముసాయిదా EIAని తదనుగుణంగా సవరించుకోవాలి. EC ఆమోదంగానీ/నియంత్రణాదికార సంస్థ దరఖాస్తు తిరస్కరణగానీ తుది EIA నివేదికపైనే ఆధారపడి ఉంటుంది.

రెండు భాగాలుగా ప్రజాభిప్రాయ సేకరణ

  1. పబ్లిక్ హియరింగ్:అన్ని TPPల విషయంలోనూ వాటి యొక్క సామర్థ్యం మరియు పద్ధతులతో ప్రమేయం లేకుండా ప్రభుత్వాధికారులు విధిగా జరిపాల్సిన సమావేశం ఇది. ఇక్కడ, ప్రాజెక్ట్ ప్రతిపాదకుడు/దరఖాస్తుదారు ప్రజల సమక్షంలో ప్రాజెక్టుని వివరించాలి. ప్రజలు వ్యక్తిగతంగా, సమష్టిగా ప్రాజెక్టుపట్లగల సందేహాలను, భయాందోళనలను వ్యక్తపరచడానికి ఇదొక వేదిక. మొత్తం ప్రొసీడింగ్స్‌ అధికారులు నమోదు చేస్తారు.
  2. లిఖిత స్పందన: ప్రాజెక్టుపట్ల తమ సందేహాలను, ఆందోళనలను ప్రజలు లిఖితపూర్వకంగాకూడా SPCBకి మరియు నియంత్రాణాధికార సంస్థకు పంపుకోవచ్చు

PC యొక్క నిర్మాణం మరియు ఉద్దేశం

ప్రచారం

ప్రజాభిప్రాయ సేకరణను ప్రకటిస్తూ అడ్వర్టయిజ్‌మెంట్లు (పబ్లిక్ హియరింగ్ మరియు లిఖిత స్పందన) స్పష్టంగానూ, సక్రమంగానూ వెలువరించాలి.

అడ్వర్టయిజ్‌మెంట్లను ఆ జిల్లాలో సర్క్యులేషన్‌లోగల ఒక ఆంగ్ల దినపత్రికలోనూ, ఒక ప్రాంతీయ భాషా దిన పత్రికలోనూ ప్రచురించాలి.

పబ్లిక్ హియరింగ్

నోటీస్ గడువు

హియరింగ్ విషయమై కనీసం నెల రోజుల ముందుగా ప్రజలకు తెలియపరచాలి.

ప్రదేశం

  1. పబ్లిక్ హియరింగ్ జరిగే ప్రదేశం ప్రాజెక్టు స్థలానికి చేరువలో ఉండాలి. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (NGT) ఆదేశాల ప్రకారం సాధ్యమైనంతవరకు ప్రాజెక్ట్ స్థలానికి ఒక కిలోమీటర్ పరిధిలోనే పబ్లిక్ హియరింగ్ జరిగే ప్రదేశం ఉండాలి. కృషి విజ్ఞాన్ ఆరోగ్య సంస్థ & Anr Vs MoEF & Ors)
  2. ప్రాజెక్ట్ స్థలానికి అతి చేరువలో ఉండే ప్రదేశాన్నే ఎంపిక చేయాలి. .[1] ఉదాహరణకు, స్థలానికి రెండు కిలోమీటర్ల దూరంలో సరైన ప్రదేశం దొరికినట్లయితే, అంతకుమించి దూరంగల మరో ప్రదేశాన్ని ఎంపిక చేయరాదు
  3. పబ్లిక్ హియరింగ్ ప్రదేశం ఒకవేళ ప్రాజెక్ట్ స్థలానికి చేరువలో లేనట్లయితే, ప్రాజెక్ట్ ప్రతిపాదకుడు ప్రజలకోసం ప్రయాణ సాధనాలను ఏర్పాటు చేయాలి. అటువంటి సందర్బంలో సైతం పబ్లిక్ హియరింగ్ జరిగే చోటు ఎక్కువ దూరంలో ఉండరాదు.[2]

ప్రభుత్వాధికారుల హాజరు తప్పనిసరి

  1. జిల్లా మేజిస్ట్రేట్ / జిల్లా కలెక్టర్ / డిప్యూటీ కమిషనర్ లేదా అదనపు జిల్లా మేజిస్ట్రేట్ హోదాకి తక్కువకాకుండా వారి ప్రతినిధులు
  2. SPCB యొక్క ప్రతినిధి/లు

ప్రజల భాగస్వామ్యం

  1. స్థానిక వర్గాలు మరియు ప్రజలు కోరుకున్న సభ్యులు.
  2. ప్రజల హాజరుపై కోరం ప్రస్తావన లేదు.
  3. హియరింగ్ సమయంలో అక్కడున్నవారందరి వివరాలు నోట్ చేసుకోవాలి.
  4. అధికారుల సమక్షంలో మాట్లాడదలిస్తే వేదికను ప్రజలకు అందుబాటులో ఉంఛాలి. (వేదికను నిర్బంధంలో ఉంచరాదు).

ప్రొసీడింగ్స్ నమోదు చేయుట

పబ్లిక్ హియరింగ్ చిత్రీకరించడానికిగాను SPCB వీడియోగ్రఫీని ఏర్పాటు చేయాలి.

SPCB సమావేశం యొక్క మినిట్స్‌ని అధికారులు నిక్కచ్చిగా నమోదు చేయాలి.

ఫిర్యాదులు

మినిట్స్‌లో నమోదు చేయబడిన వివరాలలో మరియు చదివి వినిపించిన సమాచారంలో ప్రాజెక్టుకి సంబంధించిన ఏదేని తప్పుడు సమాచారం లేదా మార్చబడిన వాస్తవం లేదా హియరింగ్ సమయంలో సమర్పించబడిన పత్రాలలో వాటి ప్రభావం గురించి పబ్లిక్ హియరింగుకి వచ్చిన అధికారుల దృష్టికి ప్రజలు తీసుకెళ్లాలి.

పబ్లిక్ హియరింగ్ నిర్వహణలో ఏవేని లోటుపాట్లు జరిగినట్లయితే MoEF/ SEIAAకి నివేదించి, తాజా విచారణకు డిమాండ్ చేయవచ్చును.

లిఖిత స్పందన

పబ్లిక్ హియరింగ్ నిమిత్తం ఇచ్చిన ఒక నెల నోటీసు గడువు సమయంలో ప్రజల నుంచి SPCBలిఖిత స్పందనలను స్వీకరించవచ్చును..

ప్రజాభిప్రాయ సేకరణ నిమిత్తం SPCB ఇచ్చే ప్రకటనలో లిఖిత పూర్వక స్పందనలు తెలియజేయడానికి వీలుగా ఈ-మెయిల్ మరియు తపాలా అడ్రెస్ ప్రచురించాలి. MoEF/SEIAAకి సమర్పించే ప్రజాభిప్రాయ నివేదికలో ఈ స్పందనలన్నింటినీ పొందుపరచాలి.

MoEF/SEIAA తమకు అందిన స్పందనలన్నింటినీ ప్రజాభిప్రాయ సేకరణ ప్రక్రియలో భాగంగా "వేగవంతమైన బట్వాడా పద్ధతి"ద్వారా ప్రాజెక్ట్ ప్రతిపాదకుడు/ దరఖాస్తుదారుకి చేరవేయాలి. లిఖితపూర్వక స్పందనలను SPCB సమర్పించే పబ్లిక్ హియరింగ్ నివేదికలో చేర్చి, SPCBవారి వెబ్‌సైట్‌తోపాటుగా, పంచాయతీ కార్యాలయాలు, జిల్లా పరిషత్, జిల్లా మేజిస్ట్రేట్ మరియు కార్యాలయాల్లో అందుబాటులో ఉంచాలి.

FAQs (తరచు వ్యక్తమయ్యే సందేహాలు)

1. నేను పబ్లిక్ హియరింగుకి హాజరు కావచ్చునా మరియు లిఖిత స్పందన తెలియపరచవచ్చునా?

తప్పకుండా, మీరు రావచ్చును.

2. నేను ప్రతిపాదిత ప్రాజెక్ట్ స్థలానికి దగ్గరలో నివసించను- అయినప్పటికీ పబ్లిక్ హియరింగుకి హాజరై, నా భావనలను తెలియజేయవచ్చునా?

తప్పకుండా. మీకు సామాజిక, పర్యావరణ సంబంధ ఆలోచనలున్నట్లయితే తప్పక రావచ్చు!

పబ్లిక్ హియరింగ్ సమావేశంలో లేవనెత్తాల్సినంత కీలక పర్యావరణ సమస్య ఏదీ నాకు లేదు. అయితేసామాజికఉపాధి సంబంధమైన అంశాలపై నా సందేహాలను ప్రస్తావించాలనుకుంటున్నాను. నేను ఆ పని చేయవచ్చునా

తప్పకుండాపబ్లిక్ హియరింగ్ ఉద్దేశమే అది. ప్రతిపాదిత ప్రాజెక్టువల్ల పర్యావరణ ప్రభావాన్ని అంచనా వేయడమే. EIA అధ్యయనంలో "పర్యావరణం" అనే పదం యొక్క అర్థాన్ని విస్తృతంగాసామాజిక మరియు ఆర్థిక (జీవనోపాధి సహా) ప్రభావాలకు సంబంధించిన అంశాలకుకూడా విస్తరించబడింది. అవన్నీ పబ్లిక్ హియరింగ్ సమయంలో ప్రస్తావించవచ్చు. EIA అధ్యయనంలో సామాజిక ప్రభావ మధింపుపునరావాస ప్రణాళిక కూడా భాగమే. ఇందుకు సంబంధించిన సమస్యలు హియరింగ్ సమయంలో లేవనెత్తవచ్చు.

ప్రాజెక్టుపై లిఖితపూర్వక స్పందనలు ఎవరు పంపవచ్చును

ప్రాజెక్ట్ లేదా చర్యలవల్ల పర్యావరణ ప్రభావిత అంశాలపై హేతుబద్ధమైన ఆలోచనలు కలిగిన కార్యకర్తలుమీడియా వ్యక్తులు కూడా స్థానిక వర్గాలతో పాటుగా లిఖిత స్పందనలు పంపవచ్చును.

5. పబ్లిక్ హియరింగ్ నిర్వహించకుండా ప్రాజెక్టుకి గనుక EC అనుమతినిచ్చినట్లయితే ఏం చేయాలి?

ECకి వ్యతిరేకంగా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌లో పిటిషన్ వేయాలి. ఇది EC అనుమతినిచ్చిన 30 రోజులలోగా జరగాలి. సహేతుకమైన కారణాలున్నట్లయితే 90 రోజులవరకు అనుమతిస్తారు.

ఏకకాలంలో ఒకే ప్రదేశంలో రెండు ప్రాజెక్టులపై పబ్లిక్ హియరింగ్ నిర్వహించవచ్చునా

కుదరదు. 2010 ఏప్రిల్ నెలలో MOEF జారీ చేసిన ఆఫీస్ మెమొరాండం ప్రకారం ఇది అంగీకారయోగ్యం కాదు. [3].

పబ్లిక్ హియరింగుని వాయిదా వేయవచ్చునా

వేయవచ్చుగానీ, అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే. సాధారణ స్థితిలో పబ్లిక్ హియరింగ్ తేదీ, సమయం మరియు ప్రదేశాన్ని మార్చడానికి కుదరదు.

 

  • పబ్లిక్ హియరింగుని జిల్లా మేజిస్ట్రేట్/ జిల్లా కలెక్టర్/ డిప్యూటీ కమిషనర్ సూచనల మేరకుమాత్రమే వాయిదా వేయడానికి వీలుంది.
  • వాయిదా నిర్ణయాన్నికూడా పబ్లిక్ హియరింగ్ ప్రకటన ప్రచురించిన పత్రికల్లోనే అడ్వర్టయిజ్‌మెంట్ రూపంలో తెలియపరచాలి. వారు గుర్తించిన అన్ని ఆఫీసులలోనూ ప్రముఖంగా కనిపించేలా ప్రదర్శించాలి.
  • ఆ తర్వాత జిల్లా మేజిస్ట్రేట్/ జిల్లా కలెక్టర్/ డిప్యూటీ కమిషనరుతో సంప్రదించిన మీదట SPCB సభ్య కార్యదర్శి తాజా తేదీ, సమయం మరియు ప్రదేశం నిర్ణయిస్తారు. దానినే తాజాగా నోటిఫై చేయాల్సి ఉంటుంది.
  • స్థానిక ప్రతికూల పరిస్థితులవల్ల పబ్లిక్ హియరింగ్ నిర్దేశిత రీతిలో జరపలేనిపక్షంలో SPCB వారు MoEF/ SEIAAకి తెలియపరచాలి. కూలంకషంగా సమీక్షించిన అనంతరం సంబంధిత కేసు విషయంలో పబ్లిక్ హియరింగ్ జరపాల్సిన అవసరం లేదని నిర్ణయించవచ్చు.
  • అయితేఇటీవలి NGT ఆదేశం ప్రకారంప్రజలు కోపోద్రిక్తంగావ్యతిరేకంగా ఉన్న పరిస్థితిలో పబ్లిక్ హియరింగుని రద్దు చేసితగిన ప్రాతినిధ్యం లభిస్తుందన్న నమ్మకం కుదిరాక మరోసారి నిర్వహించాల్సి ఉంటుంది

8. పబ్లిక్ హియరింగ్ వాయిదాకోసం ప్రజలు డిమాండ్ చేయవచ్చునా?

చేయవచ్చు. అయితే, హియరింగ్ నిర్వహణలో ఏదేని లోటుపాట్లు ఉన్నట్లయితేనే, అనగా హియరింగ్ ప్రదేశం చాలా దూరంగా ఉండడం లేదా నోటిఫైడ్ ప్రదేశాల్లో EIA ముసాయిదా అందుబాటులో లేకపోవడం వంటివి. ప్రజలు వాయిదా కోరుతూ జిల్లా మేజిస్ట్రేట్/ కలెక్టర్/ డిప్యూటీ కమిషనరుకి ఉమ్మడి విజ్ఞాపన అందజేయాల్సి ఉంటుంది.

పబ్లిక్ హియరింగులో ఎంతమంది మాట్లాడవచ్చుననే నిబంధన ఏదయినా ఉందా

పరిమితి ఏమాత్రం లేదు. హియరింగుకి హాజరైనవారందరికీ తమ అభిప్రాయాన్ని చెప్పుకునే అవకాశం కల్పించబడుతుంది.

10. పబ్లిక్ హియరింగుకి సమయాన్ని నిర్ధారిస్తారా?

లేదు. ప్రజల సందేహాలను తీర్చేంతవరకు హియరింగ్ కొనసాగుతుంది.

ఒక ప్రాజెక్టుని తీవ్ర కాలుష్య ప్రాంతంలో ప్రతిపాదించారు. ఒక ప్రాజెక్టుపై జరుగుతున్న పబ్లిక్ హియరింగులో అన్ని కాలుష్యకారక ప్రాజెక్టుల యొక్క మొత్తం ప్రభావం గురించి నేను అడగవచ్చునా

తప్పకుండా, మీరు అడగవచ్చు! ప్రాజెక్ట్ ప్రాంతంలో ప్రతిపాదితమైన మరియు త్వరలో రాబోయే ప్రాజెక్టుల యొక్క సంచిత ప్రభావాన్ని EIA అధ్యయనం మదింపు వేస్తుంది. పబ్లిక్ హియరింగులో ఆయా ప్రాజెక్టుల యొక్క సంచిత ప్రభావానికి సంబంధించిన సమస్యలను ప్రస్తావించవచ్చు.

12. ఒకవేళ ప్రాజెక్ట్ స్థలం రెండు రాష్ట్రాల సరిహద్దులో ఉన్నట్లయితే, పబ్లిక్ హియరింగ్ ఎక్కడ నిర్వహించాలి?

అటువంటి పరిస్థితిలో, ఉభయ రాష్ట్రాల SPCBలు ఉమ్మడిగా నిర్వహించాల్సి ఉంటుంది.

పబ్లిక్ హియరింగ్ విషయాన్ని ఏ విధంగా ప్రచారం చేసిందో తెలుసుకునే వీలుందా

ఉంది! పబ్లిక్ హియరింగులో ఈ సమాచారం అందుబాటులో ఉంటుంది. ఈ మేరకు ఏప్రిల్ నెలలో ఒక ఆఫీస్ మెమొరాండం జారీ చేసింది. పబ్లిక్ హియరింగుకి సంబంధించిన తేదీసమయంప్రదేశం గురించి స్థానికులకు తెలియపరచడానికి తీసుకున్న చర్యలేమిటో హియరింగ్ ప్రొసీడింగ్స్ సమయంలో తెలియజేయాలి. అదేవిధంగా హియరింగ్ అనుకున్నరీతిలోనే సాగుతున్నదీ లేనిదీ విధిగా ధ్రువీకరించాల్సి ఉంటుంది. [4]

[1]జీత్ సింగ్ కన్వార్ & ఏఎన్ఆర్ వర్సెస్ భారత ప్రభుత్వం & అదర్స్.(10-2011 (T) )

[2] కృషి విజ్ఞాన్ ఆరోగ్య సంస్థ & Ors.  v.MOEF & Ors.(7-2011 (T) ) + ఓస్సీ ఫెర్నాండెజ్ & Ors. v. MOEF & Ors.  [12-2011 (Ap) ]