- ఫారం 1
- విధి విధానాలు
- పర్యావరణ ప్రభావ అంచనా పత్రం(E.I.A.) మరియు ఎగ్జిక్యూటివ్ సంగ్రహ సమాచారం
----------------------------------------------------------------------------------------------------------------------
- ఫారం 1
1. ప్రాధమిక సమాచారం
- ప్రాజెక్ట్ పేరు
- స్వభావం
- ప్లాంట్ సామర్ధ్యం
- ప్లాంటుకు సమీప పట్టణం, నగరం, రైల్వే స్టేషన్, ఎయిర్ పోర్ట్,ఎంత దూరంలో వున్నాయో ఆ వివరం
- గ్రామ ప౦చాయితీ, జిల్లా పరిషత్, మునిసిపల్ కార్పొరేషన్, లోకల్ బాడీ తాలూకు పోస్టల్ చిరునామా మరియు కాంటాక్ట్ నంబర్లు
- కింది చట్టాల ప్రకారం ప్రాజెక్ట్ కుఅనుమతి అవసరం అయితే సంబంధించిన వివరాలు,
- అటవీ సంరక్షణచట్ట౦ ; 1980
- వన్య మృగ సంరక్షణ చట్టం ;1972
- సి. ఆర్. జెడ్ ( కోస్టల్ రెగ్యులేటరీ జోన్ ) నోటిఫికేషన్; 1991
*ప్రత్యామ్నాయ ప్రాంతాలు ఏవైనా వుంటే వాటి భౌగోళిక వివరాలు
* అనుబంధ ప్రాజెక్టులు,సమర్పించినదరఖాస్తు ఫారంవివరాలు
*అభ్యర్ధి పేరు, చిరునామా, మరియు హోదా వివరాలు
* ప్రాజెక్టు సైట్ కి సంబంధించిన ప్రభుత్వ ఆర్డర్, పాలసీ వివరాలు
- అటవీ భూమి
- b. ప్రాజెక్ట్ లేదా ప్రాంతానికి సంబంధించి ఏవైనా వివాదాలు వుంటే వాటి వివరాలు
2. యాక్టివిటీ వివరాలు
- నిర్మాణం
- ప్రాజెక్టునిర్వహణ లేక నిలుపుదల సంబంధి౦చించిన వివరాలు -ఆ ప్రాంత వర్ణన, ఆ భూమి వాడుకలో వున్నదా, నీటి బిల్లు కడుతున్నారా లాంటివి
- భూమి వాడకంలో తాత్కాలిక, శాశ్వత మార్పులు
- ప్రాజెక్టు ప్రాంతాన్నీ ఉపాధి అవసరాలకు, పెరిగిన ఉపయోగించే వారి సంఖ్య -ఆ వివరాలతో భూమి మ్యాప్
- ప్రస్తుతం ఉన్న భూమి తాలూకు క్లియరెన్స్
- చెట్లూ చేమలూ మరియూ నిర్మాణాలు
- భూముల కొత్త వినియోగాలు కనిపెట్టడం
- నిర్మాణానికి ముందు చేపట్టిన కార్యక్రమాలు అనగా బోర్ వెల్, భూమి పరీక్షలు
- కట్టడం పనులు
- కూల్చివేత పనులు
- నిర్మాణానికి ముందు భవన కూలీలకు , నిర్మాణ పనిముట్లకు, తవ్వకం పనులకు ఉపయోగించిన తాత్కాలిక జాగా మరియు ఇళ్ళు
- కాలవలు లాంటివి తవ్వి, గట్టులు నిర్మించడం, మరియు తవ్వకాలు
- గనులు, సొరంగాలు లాంటి భూమి గర్భ పనులు
- భూమి బాగు చేసి ఉపయోగంలోకి తెచ్చే పనులు
- కాలువల నుండి బురదను తీసే పనులు
- సముద్ర తీర నిర్మాణాలు
- ఉత్పత్తి ,మరియు యాంత్రిక ఉత్పత్తి
- సామగ్రిని భద్రపరచే సౌకర్యం
- ఘన, ద్రవ వ్యర్ధాల తరలింపు నిర్వహణకు సౌకర్యం
- దీర్ఘ కాలంగా పని చేస్తున్న నిర్మాణ కార్మికుల సౌకర్య కల్పన
- కొత్త రోడ్లు
- నిర్మాణ సమయంలో,లేదా ప్లాంటు నడుస్తున్న సమయంలో రైలు, సముద్ర రవాణా రద్దీ
- కొత్త, లేక ప్రత్యామ్నాయ రైలు, విమాన, సముద్ర౦ లాంటి ఇతర రవాణా మార్గాలు
- మూసేసిన ప్రస్తుతరవాణా మార్గాలు, మళ్లి౦పు రహదారులు , దానికి అవసరమైన చేపట్టిన పనులు
- కొత్త లేక మళ్ళి౦పు విద్యుత్ మరియు నీటి పైపులు
- ఆనకట్టలు, డ్యాములు, కల్వర్టులు కట్టి నీటిని నిల్వ చేయడం,
- నీటి వనరుల్ని క్రమ బద్ధీకరించడం,భూమిలోని నీటి పొరల్ని మార్పులు, నిలవ చేయడం
- నదీ నదాల ప్రవాహాల్ని మళ్ళించడం ,
- భూమి లోపల, ఉపరితల నీటిని దారి మళ్ళింపు, తరలింపు
- డ్రైనేజీ నీటి కలయిక వల్ల వాడుక నీటిలో,భూమిలో ఏర్పడిన కాలుష్యం
- ప్లాంటు నిర్మాణానికి మనుషులు , నిర్మాణ సామగ్రి రవాణా :లేదా నిర్వహణ కోసం, లేదా( ఎక్కువ కాలం పట్టే) నిర్మాణాల కూల్చివేత
- నిరుపయోగమైన ప్లాంటు నిలుపుదల సమయంలో జరిగే పన్ల వల్ల ఏర్పడే కాలుష్యం
- ప్రాజెక్ట్ పని నిమిత్తం తాత్కాలికంగానో,శాశ్వతంగానో వలస వచ్చి పెరిగిన జనాభా
- కొత్త జాతులను ప్రవేశ పెట్టుట
- ఆయా ప్రాంతాల లభ్యమయ్యే జాతులు నశించిపోవుట, ఆనువంశిక వై విధ్యం
- ఇతర కార్యక్రమాలు
3. సహజ వనరుల వినియోగం-వాటి లభ్యత వివరాలు
- భూములు:వ్యవసాయ భూములు లేక బంజరు భూములు -హెక్టార్లలో ,
- నీరు: నీటి లభ్యతా వివరాలు, వినియోగదారుల పోటి- రోజుకు అవసరమయినకిలో లిటర్ల యూనిట్లలో,
- మినరల్స్ మెట్రిక్ టన్నులతో ,
- నిర్మాణ సామగ్రి,- మొత్తంగా కావాల్సినరాయి, ఇసుక,మన్ను , ఎక్కడ లభ్యమౌతాయి , మెట్రిక్ టన్నుల్లో ,
- అడవులు, కలప లభ్యత - మెట్రిక్ టన్నులలో
- శక్తీ- విద్యుత్తు, ఇంధనాలు వాటి లభ్యత, వాడకందార్ల పోటీ, మెట్రిక్ టన్నులలో ఇంధనం, మెగా వాట్లలో విద్యుత్తు
- ఇతర సహజ వనరులు ( సరైన కొలమానం ఉపయోగించండి)
4. ఆరోగ్యానికి, పర్యావరణానికి హాని కలిగించే నిల్వల,రవాణా,ఉత్పత్తి, తాలూకు కాలుష్యం
- వ్యాధులు రావడంలో కలిగే మార్పులు .
- వ్యాధి కారకాలు ( ఉదాహరణకు క్రిములు, నీటి సంబంధిత కాలుష్యం)వదిలే దోమలు లాంటి వాటి ప్రభావం .
- ప్రజారోగ్యానికిహాని కలిగించేవి ( జీవన పరిష్టితుల్లో వచ్చిన మార్పులవల్ల)
- ఈ ప్రాజెక్టు వలన ఎక్కువ హాని పొందే ప్రజలు ( ఆస్పత్రి లో వున్న రోగులు, పిల్లలు, వృద్ధులు)
- ఇతర కారణాలు
5. నిర్మాణ సమయంలో,పని చేస్తున్నప్పుడు,కూల్చి వేసేటప్పుడు
ఏర్పడుతున్న ఘన వ్యర్ధాలు
- చెడిపోయినవి
- చట్టు రాతి పై పేరుకున్న మట్టి, గనిలో వ్యర్ధం
- మునిసిపాలిటి వారి వ్యర్ధం (గృహ, వ్యాపార సంబంధిత వృధా)
- హానికరమయిన వ్యర్ధాలు (హజార్డస్ వేస్ట్ మేనేజ్మెంట్ నిబంధనల ప్రకారం )
- పరిశ్రమల తాలూకు ఇతర వ్యర్ధాలు
- అధిక ఉత్పత్తి
- మానవ విసర్జితాలు,లేదా అధిక సరఫరా వల్ల విసర్జిన్పబడడం,
- నిర్మాణ, కూల్చివేతలకు సంబంధించిన వ్యర్ధాలు
- అధిక మెషినరీ లేక సామగ్రి
- కాలుష్య మయమైన నేల లేక ఇతర మూలకాలు
- వ్యవసాయ వ్యర్ధాలు,
- ఇతర ఘన వ్యర్ధాలు
6. విడుదలయ్యే కాలుష్యకారకాలు ,హాని కరమైన, మత్తు కలిగించే ,ఎక్కువ ప్రమాదకరమైన గాలిలోకివిడుదలయ్యే పదార్ధాలు
- జీవ జాతుల అవశేషాల దహనం వల్ల విడుదలై ,ఒకే చోట కాని, లేదా వ్యాపించే వ్యర్ధాలు, వాయువులు
- ఉత్పత్తి విధానంలో విడుదల అయ్యే వ్యర్ధాలు,వాయువులు
- సామగ్రి స్టోర్సు లో నిలవ చేసేటప్పుడు, వాడుకలోను విడుదలయిన వ్యర్ధాలు
- నిర్మాణ కార్యక్రమాల వల్ల (ప్లాంటు, పనిముట్లతో సహా) విడుదలయిన వ్యర్ధాలు
- నిర్మాణ సామగ్రి వాడుక వల్ల, పదార్ధాల ద్వారా, మానవ విసర్జితాల వల్ల,వ్యర్ధాల వల్ల విడుదలయిన దుమ్మూ, ధూళీ,
- వ్యర్ధాల్ని కాల్చడంద్వారా విడుదలయిన కాలుష్యం (ఎక్కువ కోతపని వ్యర్ధాలు, కట్టుబడి పనిలో వ్యర్ధాలు)
- వ్యర్ధాల్ని కొలిమిలో కాల్చడం ద్వారా ఏర్పడిన కాలుష్యం
- ఇతర విడుదల పదార్ధాలు
7. ధ్వని , ప్రకంపనాలు, కాంతి ద్వారా విడుయదలయ్యే వేడి
- యాంత్రిక సామగ్రి ని వాడటం ద్వారా విడుయదలయ్యే ధ్వని ( ఉదాహరణకు ఇంజన్లు, ప్లాంట్ వెంటిలేషన్, క్రషర్స్)
- పరిశ్రమల ద్వారా, ఇతర విధానాల ద్వారా
- నిర్మాణ , కూల్చివేతల ద్వారా
- పేల్చివేతల ద్వారా, కుప్పగా చేర్చడం ద్వారా
- నిర్మాణం ద్వారా లేక రవాణా ద్వారా
- వెలుతురు మరియు చల్లబరచు పద్దతుల ద్వారా
- ఇతర పద్దతులద్వారా
8.భూమి లేక నీటి కాలుష్యం వల్ల వచ్చే విపత్తు
- నూతులు, ఉపరితల జలాలు, భూ జలాలు కోస్టల్ వాటర్స్ మరియు సముద్ర జలాల లోకి వదులుతున్న కాలుష్యం
- ప్రమాద కారి అయిన సామగ్రిని, పదార్ధాల్ని నిల్వ మరియు వాడుక వల్ల విసరివేయడం వల్ల వచ్చిన కాలుష్యం
- భూమిపై, నీటిలో మానవ , జంతు విసర్జితాలు
- గాలిలోకి, నేలమీదికి,నీటిలోకి వదిలిన కాలుష్యాలు
- పై కారణాల వల్ల దీర్ఘ కాలికంగా వెదజల్లుతున్న కాలుష్యం దానివల్ల పాడవుతున్న పర్యావరణం
- ఇతర కారణాలు
9.నిర్మాణ సమయంలో గురవుతున్న ప్రమాదాలు ఆరోగ్య సమస్యలు మరియు పర్యావరణ కాలుష్యం
- పేలుళ్ళు, విధ్వంసాలు, పడటం వల్ల గాయాలు
- స్టోర్ చేసిన సామాన్ల వాడకం, హానికర పదార్ధాల ఉత్పత్తిలో
- మరే విధమైన కారణాల వల్ల భూకంపాలు , వరదలు లాంటి ప్రకృతి వైపరీత్యాలతో సహా , సంభవించే పర్యావరణ కాలుష్యం
10. పర్యావరణం దెబ్బతినడానికి దారితీసిన కారణాలు
- సహాయ కారకాలైన ఇతర ప్రాజెక్టుల అబివృద్దికి,ప్రాజెక్టు వలన అభివృద్ధికి సహాయపడేవి, పర్యావరణం పై ప్రభావం చూపేవి అయిన ఇతర అంశాలు (ఉదాహరణకు దోహదపడే హంగులు, రోడ్లు, విద్యుత్తు, వ్యర్ధ జలాల నిర్వహణ
- ఇళ్ల నిర్మాణం
- ఒక ముడి పదార్ధం నుంచి మరొక ఘన/వాయు/ద్రవ పదార్ధాన్ని తీసే పరిశ్రమలు
- సరఫరా చేయు పరిశ్రమలు
- ఇతరములు
- ప్రాజెక్ట్ సైట్ వాడుక తర్వాత పర్యావరణాన్ని దెబ్బతీసే వాహకాలు
- భవిష్యత్తులో కాలుష్య పెరుగుదలకు కారకాలుగా నిలిచిపోయేవి
- మున్ముందు రాగల ప్రాజెక్టులు, లేదా ఇప్పటికే వున్న ప్రాజెక్టులకు దగ్గరగా వుండడం వల్ల రాబోయే మొత్తం మార్పులు
11. పర్యావరణ మార్పులకు స్పందన
- అంతర్జాతీయంగా సమ్మతించిన రక్షిత ప్రాంతాలు, జాతీయ లేక స్థానిక చట్టాల వల్ల రక్షిత ప్రాంతాలుగా గుర్తింపబడిన అందమైన ప్రకృతి ప్రాంతాలు,లేదా ఒకనాగరికతకు సంబంధిచిన రక్షిత ప్రాంతాలు
- తడి భూములు, నదుల పరీవాహక ప్రాంతాలు, చెరువులు, సెలయేళ్ళు , తీర ప్రాంతాలు, పర్వతాలు, అడవులు లాంటి తప్పనిసరిగా పర్యావరణ సమతుల్యం పాటించాల్సిన ప్రాంతాలు
- వృక్షాలు, సున్నితమైన రక్షిత వన్య ప్రాణులు, పక్షులు , లాంటి వాటి పెరుగుదలకు, ఆహార సంపాదనకు, చలి ప్రాంతాల నుంచి నివాసం కొరకు, వలసలు
- దేశీయ,తీర ప్రాంత ,సముద్ర ఒడ్డున లేక, భూగర్భ జలాలు
- రాష్ర, జాతీయ సరిహద్దులు
- విహార స్థలాలు, పర్యాటక ప్రాంతాలు లాంటి ప్రజా వికాస సౌకర్యాలు , రహదారులు
- రక్షణ శాఖకు అవసరమయిన కట్టడాలు
- అధిక జనాభా నివసించు ప్రాంతాలు లేక నిర్మాణాలున్న ప్రాంతాలు
- ఆస్పత్రులు, స్కూళ్ళు, దేవాలయాలు లాంటి కమ్యూనిటీ అవసరాలకు ఉపయోగించిన ప్రాంతాలు
- భూజలాలు, భూ ఉపరితల వనరులు, అటవీ ప్రాంతాలు,వ్యవసాయ భూములు, చేపల చెరువులు, పర్యాటక ప్రాంతాలు, మినరల్స్ లాంటి విలువయిన భూములు
- చట్ట బద్ధమయిన నిబంధనలను అతిక్రమించి కాలుష్యానికి , పర్యావరణ సమతుల్యత పోయిన భూములు
- సహజ ప్రకృతి వైపరీత్యాలకు అవకాశమున్న సున్నితమైన ప్రాంతాలు (భూకంపాలు,భూమి క్రుంగి పోవడాలు, భూమి కోసుకుపోవడాలు, కొండ చరియలు విరిగి పడటాలు,వరదలు, ప్రతికూల వాతావరణ కారణాలు )
12.ఉద్దేశించిన విధి విధానాలు
అఫిడవిట్ ఈ విధం గా వుంటుంది.
ఈ దరఖాస్తు (అప్లికేషన్) లో, జత పరిచిన పత్రాలలో ఇచ్చిన వివరాలు అన్నీ నాకు తెలిసినంత వరకు నిజమైనవని హామీ ఇస్తున్నాను. ఒక వేళ ఇచ్చిన వివరాలలో ఏ కొన్ని అసత్యమైన విషయాలు ఉన్నా, ఏ స్థితి లో నైనా తప్పుదోవ పట్టించేవిగా వున్నా, నా స్వంత పూచి మీద, నా ఖర్చుతో ప్రాజెక్టు దరఖాస్తు తిరస్కరించబడుతుందనీ, అనుమతి ఇచ్చినట్లయితే, అది రద్దు చేయబడుతుందని నాకు పూర్తిగా తెలుసునని తెలియజేయడ మైనది.
తేది: అభ్యర్ధి సంతకం
స్థలం: పేరు, అడ్రసు వివరాలతో పంపాలి.
నోట్:
తీర ప్రాంత నిబంధనల జోన్ (సి.ఆర్.జెడ్)నోటిఫికేషన్ 1991 ప్రకారం , అనుమతి పొందాల్సిన ప్రాజెక్టులకు,దరఖాస్తుతో పాటి ఈ కింది పత్రాలు కూడా జత చెయ్యాల్సి వుంది.
- టర్మ్స్ ఆఫ్ రిఫెరెంస్ ఇచ్చే సమయంలో, ప్రాజెక్టు పనులు తీర ప్రాంత నిబంధనలకు అనుగుణంగా వున్నది, లేనిది చూపుతూ గుర్తింపబడిన ఏజెన్సి తయారు చేసిన సి.ఆర్.జెడ్ మ్యాపు
- పర్యావరణ అనుమతికి ముందు రాష్ట్ర తీర ప్రాంత నిబంధనల మేనేజ్మెంట్ అథారిటి వారి సిఫారసులు
జాతీయ పార్కులు, వన్య మృగ రక్షిత ప్రాంతాలు, వన్య మృగాలు, పక్షులు నివసించు రక్షితప్రాంతాలు వన్య మృగాలు తిరుగాడు ప్రాంతాలకు పది కిలో మీటర్ల దూరంలో వున్న ప్రాజెక్టులకు, ఈ కిందివి కూడా దరఖాస్తుతో జత చేసి పంపాలి.
- పై విషయాలు వివరిస్తూ ప్రాజెక్టు ఎక్కడ పెట్టేది గుర్తింపు చేసి, చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ ధృవపరిచిన మ్యాపు
- చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ గారి వాఖ్యలు
-------------------------------------------------------------------------------------------------------------------------------
2. విధి విధానాలు
1. ప్రాజెక్టు సైటు తాలూకు దీర్ఘ కాలిక లక్ష్యం తెలియజేసే డాక్యుమెంట్ వుంటే దాన్ని సమర్పించాలి
2. తీర ప్రాంత నిబంధనల జోన్ అనుమతి, పర్యావరణ అనుమతులలో విధించిన షరతులు జరిగి పోయిన స్థాయి వరకు పాటిస్తున్నట్లు హామీ పత్రం సమర్పించాలి.
3.అప్రూవ్ అయిన పాజెక్ట్ సైట్ తాలూకు పూర్తి వివరాలను తెలిపే ఎగ్జిక్యూటివ్ సమ్మరీ,దానితో పాటు అనుమతించబడిన సైట్ తాలుకుఇటీవలీ ఫోటోగ్రాఫ్ లను సమర్పించాలి.
4.పబ్లిక్ హియరింగ్ లో, రాత పూర్వక జవాబుల్లోనూ, లేవనెత్తిన సమస్యలు, వాటికి సంబంధించిన సమాధానాలు ,బడ్జెట్ కేటాయింపుతో పాటు, ఆ సమస్య సరిచేసేందుకు సమయ పాలన –ఇవన్నీ కుడా ఒక పట్టిక రూపంలో ఇవ్వాలి.
5.ప్లాంటు స్థలంలో, బిల్డింగ్ పైన, ఇంకా లభ్యమైన ప్రాంతాలలో సూర్య రశ్మి నుంచి విద్యుత్తు ఉత్పత్తి చేయడాన్ని పొందికగా రూపొందించడమే కాకుండా, ఆచరణలో ఎలా జరుగుతోందో పర్యావరణ మంత్రిత్వ శాఖకు తెలియజేయాలి.
6.ప్లాంటు స్థాపనకు అనుమతించిన స్థలాన్ని యాష్ పాండ్ ఉన్న ప్రాంతంతో పాటు 1:50,000 నిష్పత్తిలో బౌగోళిక వర్ణన సమర్పించాలి.అంతే కాక, ప్లాంటు సరిహద్దులు జి.పి.ఎస్. (గ్లోబల్ పొజిషన్ సిస్టం) తో తీసిన వివరాలు, నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సి ద్వారా ఆ ప్రాంత శాటిలైట్ మ్యాప్ సమర్పించాలి.కాలవలు, నదులు,సెలయేళ్ళు మొదలైన వాటికి దగ్గరలో ప్లాంటు కడుతుంటే, భూమి ఉపరితలానికి ఎంత ఎత్తులోప్లాంటు,యాష్ పాండ్ ఉండబోతున్నాయో తెలియజేయాలి. కాలవల నుంచి, నదుల నుంచి, సెలయేళ్ల నుంచి,పంపుల నుంచి వరద రాగలిగిన ఎత్తుకు (హై ఫ్లడ్ లెవెల్ ) మించి ,ప్లాంటు ఎత్తు ఎంత పెంచుతున్నారో తెలియజేయాలి.
7.ప్లాంటు స్థలం లే అవుట్ ప్లాను సమర్పించాలి. ఈ ప్లానులో ప్లాంటు ఏరియా,యాష్ పాండ్, హరిత ప్రాంతం,ప్లాంటుకు అవసరమైన మూలకాలు, రోడ్లు మొదలైనవి –అన్నీ సమర్పించాలి.
8. ప్లాంటు నిర్మాణానికి స్థలాన్ని అవసరమైనంత మాత్రమే ఏదైనా, ఆయా సమయాల్లో సి.ఇ.ఏ. నిర్దేశించినంత వరకే కొనాలి. విడివిడిగా ఆయా విభాగాలకు ఎంతెంత స్థల కావాలో (ఇ.ఏ.సి. మార్చిన) మళ్ళీ సరిచేసిన లే అవుట్ తెలియజేయాలి.
9. రెవెన్యు రికార్డుల ప్రకారం (ఎటువంటి తనఖాలు లేని స్థలం –దీనికి సంబంధించిన రికార్డులు తీసుకోవాలి )ప్రాజెక్టు స్థాపించే స్థలం ప్రస్తుతంఎలా ఉపయోగపడుతున్నది తెలియజేయాలి.ఎందుకంటే, బొగ్గు రవాణాకు, పైపులైన్లు (ఆర్.ఒ.డబ్యు తో సహా) వేయడానికి ఈ సమాచారం చాలా అవసరం.
10. భూమి కొనుగోలు, స్వాధీనం చేసుకోవడంలో సమస్యలు, రెవెన్యు రికవరీ యాక్టు లాంటి వాటి అవసరం, దీనికి ఎంత సమయం పడుతుంది అనేది కూడా ముఖ్యం.ఈ వివరాలు ఇ.ఐ.ఏ. రిపోర్టులో పేర్కొనాలి.
11. శాటిలైట్ ఫోటోలు గాని, లేదా సెర్టిఫై చేసిన భౌగోళిక మ్యాపు గాని పంపాలి.ఇందులో మురుగు నీరు, వ్యవసాయ భూములు,మాగాణి భూములు, నది పరివాహకప్రాంతాలు, సెలయేళ్ళు, చెరువులు లాంటివి, చుట్టుపక్కల పల్లెలు, చిన్న కాలవలు, సముద్ర, నది తీరాలలో పెరిగే చెట్ల తోపులు,నదులు, రిజర్వాయర్లు లాంటివి, ప్రాజెక్టు ప్రాంతంలో ఏమేమి వున్నాయో అవన్నీ గుర్తించాలి.
12. నేషనల్ పార్కులు, వన్య ప్రాణుల సంరక్షణ కేంద్రాలు, ఏనుగుల/పులుల రిజర్వ్ ఫారెస్టు(ఇప్పటికే వున్నవి,లేదా పెట్టబోయేవి),పక్షులు వలస వచ్చే తోవలు వగైరాలు ప్రాజెక్టు ప్రాంతానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లయితే మ్యాపులో గుర్తించి, చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ గారి చేత సెర్టిఫై చేయించాలి.
13. పరిశీలనార్ధం ఎంచుకున్న ప్రాజెక్టు స్థలం, దాని చుట్టుపక్కల ప్రాంతాలు సర్వే ఆఫ్ ఇండియా వారి మ్యాపు 1 :50,000 స్కేలుపై చిత్రించినది, దానితో పాటు మరొక మ్యాపు 1:25,000 స్కేలుపై చిత్రించినది సమర్పించాలి. ఇందులో ప్రాజెక్టు ప్రాంతంలో పూడ్చాల్సిన గోతులులాంటివి, కందకాలు లాంటివి వుంటే, దాని వివరాలు, అది పూడ్చడానికి కావాల్సిన మట్టి లాంటివి ఎంత కావాలి, వాటిని ఎక్కడ నుంచి ఎలా రవాణా చేసి తీసుకొస్తారు లాంటి వివరాలు మ్యాపుతో పాటు పంపాలి.
14. ప్రాజెక్టు ప్రాంతాలలో భూమి ఏ విధంగా ఉపయోగిస్తున్నారు అనేది సవివరంగా తెలియజేయాలి. అందులో అందరికి ఉపయోగపడే ప్రాంతాలు ( పశువుల దాణా కొరకు గడ్డి పెంచుతున్న భూములు, సామాజిక ప్రయోజనాల కోసం ఉపయోగిస్తున్న భూములు, నీటి వనరులు లాంటివి),వాటి రక్షణకు సరైన ప్రణాళిక ఏర్పరుచుకోవాలి. ఒక వేళ గడ్డి భూములను ప్లాంటు కోసం కొనుగోలు చెయ్యడం జరిగితే, అంతే భూమిని పశువుల మేత కోసం కొనుగోలు చేసి పశువుల మేత పెంచే ప్రణాళిక కూడా ఇవ్వాలి.
15. ప్రాజెక్టు ప్రాంతానికి చెందిన ఖనిజ లోహ మ్యాపు ( మట్టి లక్షణాలతో సహా) తయారు చేసి, ఆ ప్రాంతం ఖనిజాలు కోసం గనులు తవ్వడం లాభదాయకం కాని ప్రాంతమని తెలియజేయాలి.
16. భారత ప్రభుత్వ ఫ్లై యాష్ వినియోగ సరికొత్త ప్రకటన ఫ్రకారం, నూటికి నూరు శాతం ఫ్లై యాష్ వినియోగ ప్రణాళికను, కాంట్రాక్టు పార్టీల ఒడంబడిక వివరాలను సమర్పించాలి. ఆ ప్రణాళికలో బాటం యాష్ ఎలా పరిష్కరిస్తారో కూడా తెలపాలి.
17. ప్రాజెక్టు నీటి అవసరాలు సెంట్రల్ ఎలక్ట్రిసిటి అథారిటి వారి లెక్కప్రకారం ఆయా సమయాల్లో ఎంత కావాలో , నీటి వనరులు ఎంత వున్నాయో చూపిస్తూ బొమ్మ గీసి తెలియజేయాలి. నీటి నిల్వలు ఎంతెంత వున్నాయో లెక్క వేసినప్పుడు, నీటిని రిసైకిల్ చేస్తున్న విషయాన్ని గుర్తుంచుకోవాలి.
18. ప్రాజెక్టు ప్రాంతన్లోంచి పారే నీటి వనరులు (నల్ల, చిన్న కాలువలు, ఏరులు) దిశను మార్చ రాదు. ఒక వేళ మార్చాల్సి వస్తే, మార్చిన దిశ వల్ల మురుగు నీరు (డ్రైనేజి) సిస్టం పాడవకుండా చూడాలి. అలా మార్చాల్సిన దిశ వివరాలు ఆయా డిపార్ట్మెంట్ వాళ్ళు నిర్ధారణ చేసి పంపుతారు.
19.నదులు, సెలయేళ్ళు లాంటి వాటికి దగ్గరున్న ప్లాంటు హద్దులు వరద ముంపు ప్రాంతానికి కనీసం 500 మీటర్ల దూరం వుండాలి.
20. భూగర్భ జలాలు ,భూ గర్భ అంశాలకు సంబంధించి ఒక పేరుపొందిన సంస్థ లేదా ఏజెన్సితో ప్రాజెక్టు ప్రాంతంలో, ప్రాజెక్టు వలన భూమి ఉపరితలం , భూ గర్భం జలాలలో ఏర్పడే ప్రభావం పూర్తిగా పరిశోధన చేయించాలి. కాలుష్య సమస్యను ఎదుర్కొనే ప్రణాళిక తెలియజేయాలి.
21.ప్లాంటు కోసం కాలువలు,నది,లేక సముద్రం, లేదా ఏటి నుంచి నీరు తీసుకుని,మళ్ళీ నీటి వ్యర్ధాలు ఆ కాలువల్లో, నదిలో, సముద్రంలో, ఏటిలోకి వదలడం జరుగవచ్చు. దీనివల్ల, జీవ జంతువుల పై, నదుల్లో, కాలువల్లో,సముద్రంలోని మత్స్య సంపదపై ప్రభావం ఎలా వుండబోతోందో పరిశోధించి, ఆ రిపోర్టు ఇ.ఐ.ఏ. తో జత చేసి పంపాలి. మెరైన్ ఇంపాక్ట్ అసెస్మెంట్ గురించి పరిశోధన చెయ్యాల్సి వస్తే, ఎక్కడినుంచి,ఎంత నీటిని తీసుకోవడం జరుతుందో,అలాగే ఎంత నీటి వ్యర్ధాలు వదలడం జరుగుతుందో కూడా తెలియజేయాలి.
22 . నీటి వనరుల వివరాలు ,ఉత్పత్తి లేని లేదా, తక్కువ వున్న సమయంలో కూడా ప్లాంటుకు నీటి సరఫరా చేసే అవకాశాలు, నీటిని ప్లాంట్ కోసం తీసుకున్నందువల్ల, జీవ జాతుల పర్యావరణం లో మార్పు, ఒక వేళ ఇతర రాష్ట్రాలతో నీటి పంపకాలు ఉన్నట్లయితే పై అంశాలన్నీఈ సందర్భంలో కూడా పరిశీలన అవసరమవుతుంది. అంతే కాదు, ప్లాంటు కోసం తీసుకునే నీటికి మరో ప్రాజెక్టుతో పోటీ ఉందేమో చూడాలి. నీటిని సరఫరా చెయ్యగలమని సంబంధిత నీటి వనరుల అధికారులు ఇచ్చే హామీ పత్రం కూడా జత చెయ్యాలి.
23. వర్షపు నీరు ఆదా చేయడంపైన,దాన్ని ప్లాంటులో ఉపయోగించడం పైన సవివరమైన ప్రణాళిక సమర్పించాలి.
24. జీరో కాలుష్య విడుదల అనే భావన (కాన్సెప్ట్)గురించి, దాని సాధించే అవకాశాల గురించి బాగా పరిశీలించి , ఆ వివరాలు సమర్పించాలి.
25.పవర్ ప్లాంటులో నీరు సైకిల్ చక్రం లాగ మళ్ళీ మళ్ళీ ఉపయోగించడం అవుతుంది. అలా ఉపయోగించే నీటిని పూర్తిగా ఉపయోగించే పద్ధతి(సైకిల్స్ ఆఫ్ కాన్సంట్రే షన్ , COC), మిగతా నీటి పొదుపు విధానాలతో సహా వివరించాలి.
26.యాష్ పాండ్ నీటిని తిరిగి ఉపయోగించే ప్రణాళిక, అది అమలు చేసే విధానం చెప్పాలి.
27. నీటి నాణ్యత ఒకేలా ఉండేలా పర్యవేక్షించే ప్లాను, అది ఎప్పటికప్పుడు రికార్డులలో నమోదు చెయ్యడం విధించాలి. ఈ పర్యవేక్షణ వివరాలు, ఏ ఏ చోట్ల పర్యవేక్షణ (ప్లాంటు నుండి డ్రైనేజ్ పోయే మార్గం -భూమి ఉపరితలంపైన,భూగర్భంలోని నీటి వనరుల వరకు) చేయడం అన్నది వివరంగా సమర్పించాలి.
28. ప్లాంటుకు 10 కిలో మీటర్ల వరకు వున్నప్రాంతంలో సామాజిక ఆర్ధిక అంశాలపై పేరుపొందిన సంస్థ చేత పరిశోధన చేయించాలి. ఆ ప్రాంతాల ప్రజల జీవనాధారంపై ప్లాంటు ప్రభావం వివరం ఇవ్వాలి.
29. ఆ ప్రాంతంలో నివసించే పని చేయగల యువకులను గుర్తించి వాళ్లకు ప్లాంటులో పనిచేసేందుకు అవసరమైన ట్రైనింగ్ ఇచ్చే ప్రణాళిక తయారు చెయ్యాలి. ప్లాంటు నిర్మాణ సమయంలో, నడుస్తున్న సమయంలో ఎంతమందికి ఉపాధి కల్పించగలరో వివరించాలి.
30. ప్రాజెక్టు ప్రాంతంలో గిరిజనులు నివసిస్తున్నట్లయితే, వాళ్ళ హక్కులకు భంగం కలగకుండా చూడాలి. ఆ యా ప్రాంతాల గిరిజన చట్టాల ప్రకారం, గిరిజనుల సమస్యలు, ప్రాజెక్టు అభ్యర్ధి గుర్తించాలి.
31. కార్పోరేట్ సంస్థలు తీసుకోవాల్సిన సామాజిక బాధ్యత(C S R-కార్పోరేట్ సస్టెయిన్బిలిటి అండ్ రెస్పాన్సిబిలిటి) గురించి ఒక పూర్తి ప్రణాళిక, దానిలో ప్రతి అంశానికి కేటాయించిన మొత్తంతో సహా తయారు చెయ్యాలి. ప్రతి అంశం కూడా అవసరాన్నిబట్టి గుర్తించాలి. సాంప్రదాయ పరమైన నిపుణులతో సమానంగా అబివృద్ది చెందే పద్ధతిలోబీద వారికి జీవనాధార ఉపాధి కల్పించే అవకాశాలు గుర్తించాల్సి వుంది.సామాజిక అభివృద్ధి కార్యక్రమాలకు వేరే బడ్జెట్, మరియు ఆదాయం ఉత్పత్తి చేసే కార్యక్రమాలు తెలియజేయాలి.
32. సి.ఎస్.ఆర్. స్కీములు తయారు చేసేటప్పుడు, ఏ ఏ స్కిములలో, పర్యవేక్షణ కూడా నిబిడికృతమై వుందో వాటినే చేర్చాలి. దగ్గరలోని పేరున్న ప్రభుత్వ సంస్థ చేత సోషల్ ఆడిట్ చేయించాలి. ప్రాజెక్టు అభ్యర్ధి ఈ స్కీం లు ఆయా సమయాల్లో అమలు చెయ్యడానికి ఒక ప్రణాళిక ఏర్పరుచుకుని, ఏదైనా ప్రభుత్వ స్కీం తో కలిపి అమలు చేయచేయ్యాలి.
33. ప్రాజెక్టు నిర్మాణం వలన హక్కులు ,జీవనాధారం కోల్పోయిన ప్రజలకు
పునరావాసం,పరిహారం(ఆర్.ఆర్)ఏర్పాటు చెయ్యడం గురించి దృష్టి పెట్టాలి. ప్లాంటు స్థలం లో ఉపాధి పనులు చేస్తూ బతుకుతున్న వారు, ఆ ప్రాంతం స్వంతదార్లు , , సామాజిక ఆర్ధిక అవసరాల సమగ్ర సర్వేజనాభా ప్రాతిపదికన నిర్వహింఛి అప్పుడు ఆర్.ఆర్ ప్లాను తయారు చెయ్యాలి.
34. ఆ ప్రాంతంలో ఆ ప్లాంటులో పనిచేసే వారికి, పర్యావరణం మూలంగా రాగల వ్యాధుల గురించి తెలుసుకుని , వాటి నివారణకు ఒక ప్రణాళిక తయారు చెయ్యాలి.
35.ప్లాంటులో పనిచేసేటప్పుడు నిర్వహరణలో వచ్చే ఆరోగ్య సమస్యలు గుర్తించి,ముందు జాగ్రత్తలు, నివారణ చర్యలు సూత్రీకరిచుకోవాలి. కంపెని పని నిర్వహరణలో వచ్చే ఆరోగ్య సమస్యలపై అవగాహన వున్న, పూర్తి సమయం కేటాయించే , పట్టా పొందిన డాక్టర్ను నియమించాలి. క్రమం తప్పకుండా, నిర్ణిత సమయాల్లో పనివారి ఆరోగ్య పరీక్షలు చేయించాలి. వారి ఆరోగ్య రికార్డులు నిర్వహించాలి. ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశాల గురించి, ముందు జాగ్రత్త చర్యలు వారికి సూచించాలి.అవసరమైన సామాగ్రి వారికి అందజేయాలి. అలా తీసుకున్న ఆరోగ్య జాగ్రత్త చర్యల ఫలితాలను ,రెండేళ్ళకొక సారి సమీ క్షించి, అవసరమైతే మరింత చక్కని పర్యవేక్షణ అమలు చేయ వచ్చు.
36.పర్యావరణం, అడవుల మంత్రిత్వ శాఖ 16.11.09 వ తేదిన చేసిన ఆదేశాల ప్రకారం (వర్షా కాలం వదిలేసి)ఒక పూర్తి సీజన్ కు సంబంధించిన భూ వాతావరణం, జీవజాతులు పిల్చుకునే గాలి స్వచ్చత డేటా అంతా తేదిలతో సహా, పర్యవేక్షించి రికార్డు చెయ్యాలి. A.A.Q. (యాం బి ఎంట్ ఎయిర్ క్వాలిటి )జీవ జాతులు పిల్చుకునే గాలి స్వచ్చత డేటాలో సస్పెండేడ్ పార్టిక్యులేట్ మేటర్, రెస్పిరబుల్ సస్పెండేడ్ పార్టిక్యులేట్ మేటర్(పి.ఎం 10 ,పి.ఎం.2.5),ఎస్.ఒ.2 (SO2),NOX ,Hg,మరియు O3 (భూమి ఉపరితలంపై ) అన్ని కూడా వుండాలి. ఈ పర్యవేక్షణ కేంద్రాలు ఎక్కువ గాలి వాలు వున్న ప్రాంతాలు, జనాభా వున్న ప్రాంతాలు, చుట్టు పక్కల వున్న పల్లెలు, అడవులు లాంటి వాయువులు గ్రహించే సున్నితమైన ప్రాంతాలు –ఇవన్ని దృష్టిలో వుంచుకోవాలి. కనీసం ఒక పర్యవేక్షణ కేంద్రం ఎగువ వైపు వీచే గాలి దిశలో, మరొకటి దిగువ వైపు బలంగా వీచే గాలి దిశలోను ఆయా ప్రాంతాలలో నేల మీద ఎక్కడ ఎక్కువ దట్టంగా చేరే అవకాశం వుందో అక్కడ ఇవి నెలకొల్పాలి.
37. ప్రాజెక్టు స్థాపించబోయే ప్రాంతంలో అప్పటికే వున్న,పెట్టబోయే పరిశ్రమల లిస్టు తాయారు చేసి సమర్పించాలి.
38. రవాణా సమయం తో కలుపుకుని , మొత్తంగా ఈ వెలువడే హానికరమైన వాయువులు, పదార్ధాలు , జీవ జాతి పిల్చే గాలి స్వచ్చతను ఎంత మేర కాలుష్య పరుస్తున్నాయో జాగ్రత్తగా అంచనా వెయ్యాలి.ఏ మోడల్ వాడడం జరిగిందో, నింపిన సమాచారం గురించి వివరాలు తెలపాలి.ఆ ప్రాంత గాలి స్వచ్చత చూపించే మ్యాపులో, ప్రాజెక్టు ప్రాంతం, జనావాస ప్రాంతాలు, కాలుష్య గాలి వలన హాని కలిగే అడవులు లాంటివి గుర్తించాలి. గాలి దిశ, వేగం చూపించాలి.
39.ప్లాంటులో ఉపయోగించే బొగ్గు వలన ఉత్పన్నమయ్యే రేడియో యాక్టి విటి , హెవీ మెటల్స్ వున్న విషయాన్ని పరీక్షించి,మిగిలిన లాబొరేటరి పరీక్షలతో పంపాలి.
40. ఇంధనం గురించిన విశ్లేషణ వివరాలు ఇవ్వాలి. అనుబంధ ఇంధనం ఏదైనా ఉన్నట్లయితే, దాని నాణ్యత, ఎంత కావాలి, దాన్ని ఎక్కడ నిలవ చేస్తారు –ఇవన్ని వివరించాలి.
41.ఇంధనం ఎంత కావాలో,అది లభించే చోటు, దాని లక్షణాలు , క్రమ పద్ధతిలో ఇంధన సరఫరాకు చేసుకున్న ఒప్పందం సమర్పించాలి.
42.ఇంధన సరఫరా పోర్టు నుంచి మొదలుపెట్టి ప్లాంటు వరకు తీసుకురావడంలో గాలి స్వచ్చతలో ఎలాంటి మార్పులు రావచ్చో అంచనా వేసి సమర్పించాలి. ప్లాంటుకు ఇంధన సరఫరా ఎక్కువ దూరం నుంచి తెవాల్సి వస్తే, రైల్వే రవాణా ద్వారా సరఫరా జరిగేటట్లు చూడాలి. ఇంధనం రైల్వే వాగాన్లోకి నింపేటప్పుడు,కన్వేయర్ బెల్ట్ ద్వారా గాని, సిలో నుపయోగించి గాని చెయ్యాలి.
43. బొగ్గు దిగుమతి చేసుకునే ప్రాజెక్టులలో , ప్రాంతీయ రవాణా, పోర్టులో బొగ్గు ఎక్కించడం, దింపడం ,రోలింగ్ స్టాక్స్, రైల్వే రవాణా లాంటి చిక్కు సమస్యలను జాగ్రత్తగా పరీక్షించి వివరాలు సమర్పించాలి.
44. పరిసరాల శుభ్రత, ఇంధనం, విశ్రాంతి గృహాలు,వైద్య సదుపాయాలూ, ప్లాంటు స్థాపించే సమయంలో తగు జాగ్రత్తలు మొదలగు ప్రాధమిక అవసరాలు,ప్లాంటు కట్టుబడి సమయంలో కూలీలకు, ప్లాంటు నడుస్తున్న సమయంలో తాత్కాలిక పని వారికి, ట్రక్కు డ్రైవర్లకు అవసరమైనంత మేర అందించాలి. ఆవివరాలు తెలిజేయాలి.
45.ప్లాంటు వల్లహాని కరమైన ప్రభావం తగ్గించే అవసరమైన చర్యలు, దానికి అయ్యే ఖర్చు నిర్ణిత సమయానికి కార్యాచరణ ఉండేలా ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ ప్లాన్ ఏర్పరుచుకోవాలి.
46.విపత్తులు సంభవించినప్పుడు ఆచరించాల్సిన మేనేజ్మెంట్ ప్లాను(డి సాస్టర్ మేనేజ్మెంట్ ప్లాన్-DMP) , అగ్ని ప్రమాదాలు, ఇంధనం నిలవ చేయడం ,వాడకం వలన పేలుళ్లు లాంటి వాటితో సహా విపత్తులు సంభవించే అవకాశాలను పరిశీలించాలి. ఏ సమయంలో నైనా ప్లాంటులో అధికంగా ఇన్వెంటరి (సరుకు, ఫర్నిచర్ లాంటివి) ఎంతవరకు ఉంచవచ్చో గుర్తించాలి. ప్లాంట్ లే అవుట్ మ్యాపులో ప్రమాద హేతువులు కాదగిన చోట గుర్తులు పెట్టడం వల్ల, ప్రమాదం జరిగినప్పుడు ఏ ఏ పనులు ఆటంకం ఏర్పడ వచ్చో తెలుస్తుంది.దాన్ని బట్టి, ముందస్తు రక్షణ చర్యలు తీసుకోవాలి. అగ్ని ప్రమాదాలనుంచి కూడా జాగ్రత్తలు తీసుకోవాలి.
47.అలా తాయారు చేసిన డి. ఎం.పి. ప్లానులో సునామీలకు, సైక్లోన్లకు, తుఫానులకు, భూ కంపాలకు వర్తించే అవసర చర్యలు కూడా ఏర్పాటు చేసుకోవాలి. ఈ డి.ఎం.పి.ప్లాను ప్రాజెక్టు ప్రాంతంలోపల, బయట కూడా అవకాశాల్ని పరిగణలోకి తీసుకోవాలి. జరగే అవకాశమున్న ప్రమాదాలను ఎలా అరికట్టాలో, ఆ కార్యాచరణ ఎవరికి అప్పగించబడిందో వివరించాలి. ప్లాను సంక్షిప్తంగా ఇంగ్లీషులో, ప్రాంతీయ భాషలో తాయారు చెయ్యాలి.
48. ప్లాంటు సరిహద్దులో(అవకాశం లేని ప్రాంతాలలో తప్ప),50 నుండి 100 మీటర్ల వెడల్పున ,మూడు వరసలలో ఆప్రాంతంలో పెరిగే మొక్కలను పెంచాలి. ఇవి ఒక హెక్టారుకు 2000 నుంచి 2500 వరకు దట్టంగా పెరిగే మొక్కలు , నూటికి 80% పెరిగేవిగా వుండాలి. ఇలా చెట్లను పెంచుతున్నట్లు (గ్రీన్ బెల్ట్ )ధ్రువ పరుస్తూ ఫోటోలు, నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సి రేపోర్తులతో సహా సమర్పించాలి.
49. గ్రీన్ బెల్ట్ పైన కార్బన్ వాయువులను పీల్చుకునేందుకుఅడవి కొట్టివేసినప్రాంతమలో అదనపు చెట్ల తోపు పెంచాలి.ఇది జిల్లా అటవీ శాఖ వారి సహకారంతో జరగాలి. దీనికి సంబంధించిన ప్లాను వివరాలు, సమయ పాలనా, బడ్జెట్ తాయారు చేసుకోవాలి. మంత్రిత్వ శాఖకు ఆరు నెలలకొక సారి కార్యాచరణ వివరాలు రిపోర్టు చెయ్యాలి.
50. కార్పోరేట్ పర్యావరణ విధానం
ఏ)కంపెనీకి పద్దతిగా తయారు చేసిన పర్యావరణ విధానం ,డైరెక్టర్ల అనుమతి పొంది వున్నదా? వుంటే, అది ఇ.ఐ.ఏ. రిపోర్టులో వివరించాలి.
బి) పర్యావరణ అనుమతి, అటవీ శాఖ వారి నిబంధనలు, షరతులు వదిలి వేయ్యడం కాని, మార్పు చేసుకోవడం కాని, అతిక్రమించడం కాని, బయట పెట్టేందుకు ఈ పర్యావరణ విధానంలో నిర్దేశించిన పద్ధతులు ఏవైనా ఉన్నాయా? వుంటే అవి ఇ.ఐ .ఏ. లో వివరించాలి.
సి)పర్యావరణ సమస్యల గురించి, లేక పర్యావరణ అనుమతిలో ఇచ్చిన షరతులను పాటించే విషయంలోగాని, కంపెనీలో పై అధికారుల విధానంలేక, ఆదేశం ఏమిటి? వివరాలు ఇవ్వాలి.
డి) పర్యావరణ నిబంధనలు పాటించకపోయినా, అతిక్రమించినా, డైరెక్టర్లకు, షేర్ హోల్డర్లకు/పెట్టుబడి దార్లకు రిపోర్టు చేసే పద్ధతి వున్నదా?ఆ రిపోర్టింగ్ విధానం ఇ.ఐ.ఏ. రిపోర్టులో వివరించండి.
51) పైన సూచించిన వివరాలు అన్నీ సమగ్రంగా ఇ.ఐ.ఏ. రిపోర్టులో చూపించాలి. అలాగే కమిటిలో చెప్పాలి.
52. ప్రాజెక్టుకు సంబంధించి ఏ కోర్టులో నైనా,లేదా ట్రిబ్యునల్ లో అయినా కేసు నడుస్తున్నట్లయితే,ఆ వివరాలు తప్పనిసరిగా తెలియజేయాలి.
తీరప్రాంతంలో నెలకొల్పే ప్రాజెక్టులకు అదనపు విధివిధానాలు
పైన ఇచ్చిన షరతులతో పాటు, తీర ప్రాంతంలో నెలకొల్పే ప్రాజెక్టుల విషయంలో ఈ కింది వాటిని కూడా పాటించాల్సి వుంది :
- రాంసర్ ప్రతినిధుల సమావేశంలో నిర్ణయించిన లక్షణాలు పల్లపు ప్రాంతాలలో కనబడితే మాగాణి నేలలుగా గుర్తించి, ప్రాజెక్టు ప్రాంతానికి, ఆ భూములకు స్పష్టమైన సరిహద్దులు ఏర్పరచుకోవాలి.
- ప్రాజెక్టు ప్రాంతం బురద నేలలో వున్నాదగ్గరలో వున్నా, బాక్ వాటర్స్ ప్రాంతం దగ్గరలో వున్నా, ప్రాజెక్టు స్థలం నుంచి అవి మినహాయించాలి. తీర ప్రాంత నిబంధనల ననుసరించి, ప్రాజెక్టు సరిహద్దు ఇలాంటి వాటికి దూరంగా వుండాలి. సి.ఆర్.జెడ్ వారి సర్టిఫై చేసిన మ్యాపు కుడా జత చెయ్యాలి.
- నేల చదును చెయ్యడం గాని, ఎత్తు పల్లాలు లేకుండా సమాంతరంగా చెయ్యడంలో కాని, అప్పటికే సహజంగా వున్న డ్రైనేజి సిస్టం కు ఎటువంటి సమస్యా రాకుండా చూడాలి. ఒక వేళ, చిన్న కాలువల త్రోవ మార్చాల్సి వస్తే,ప్లాంటు ప్రాంతంలోను, చుట్టుపక్కలా చేరే వరద నీటిని, బురద నేలలలోకి గాని, లేదా పెద్ద కాలవలోకి గాని ప్రవహించేటట్లు, అక్కడినుంచి ఈ వరద నీరు సముద్రంలోకి చేరే విధంగా ఏర్పాటు చెయ్యాలి.
- ప్లాంటు స్థలాని ఎత్తు పెంచడానికి గాని, మరొక దాని కోసంగాని, అదనంగా మట్టి కావాల్సి వస్తే, ఆ మట్టిని ప్లాంటు ప్రాంతాల నుంఛి, ఉన్న డ్రైనేజ్ సిస్టం దెబ్బతినకుండా తీసుకోవాలి.
- బురద నేలలలో ఎక్కువ వరద నీరు వచ్చి చేరుతుంది కనుక వాటిని ప్లాంటు కోసం ఏ రకంగాను ఉపయోగించరాదు.
- ఏ రకమైన వ్యర్ధాలు కూడా, కాలుష్య నియంత్రణ చేయకుండా కాలువలలోకి గాని, బురద నేలలలోకి గాని, నదు ల్లోకి గాని, సముద్రంలోకి గాని వదిలివేయరాదు.
- ప్రాజెక్టు ప్రాంతాలలో మాంగ్రోవ్ తోపు లు వుంటే, వాటి రక్షణకు, మళ్ళీ పెరుగుదలకు నిర్ణీత కాలంలో అమలు చేసే విధంగా ఒక యాక్షన్ ప్లాను తయారుచెయ్యాలి.
- ప్రాజెక్టు అభ్యర్ధి పర్యావరణ మేనేజ్మెంట్ ప్రణాళిక బడ్జెట్ లో భాగంగా,గ్రీన్ ఎండోవ్ మెంట్ ఫండ్ ఏర్పాటు చేసుకోవాలి. ఆ ఫండ్ లో వచ్చే వడ్డీతో ప్లాంటు ప్రాంతం అంతా చెట్లు నాటి , పచ్చదనాన్ని పెంచాలి.
- సామాజిక ఆర్ధిక రంగాలలో మత్స్య సంపద, మత్స్యకారులపై ప్లాంటు యొక్క ప్రభావం అంచనా వెయ్యాలి.
- కార్పోరేట్ సామాజిక బాధ్యత కింద గ్రాంట్ చేసిన మొత్తంలోంచి, మత్స్యకారుల సంక్షేమ నిధి ఏర్పాటు చేసుకోవాలి. అది మత్స్యకారులకు అవసరమైన ఫిష్ లాండింగ్ ఫ్లాట్ఫా రాలు,ఫిష్ హార్బర్లు,కోల్డు స్తోరేజిలు ఏర్పాటు చేసి వారి జీవన స్థాయిని పెంచేందుకుకృషి చెయ్యాలి. అల్లకల్లోలంగా వున్న సముద్రంపై ప్రయాణిస్తున్నవారు,ఉష్ణ మండల తుఫాన్లలో చిక్కుకున్న వారు, వగైరా అత్యవసర సమయాల్లో, వాళ్ళకు సహాయం చెయ్యాలి.
- ప్లాంటు కట్టుబడి పని మొదలుపెట్టే ముందే,సునామీ లాంటి ప్రమాద పరిస్థితుల్లో సహాయ కార్యక్రమాలు చేసే ప్రణాళిక సిద్ధంచేసి సమర్పించాలి.
- ప్రాజెక్టు ప్రాంతాలలో వున్న కాలువలు,చిన్న నీటి కయ్యలు, చెరువులలో నీరు, నేల ఇవేవి సముద్రంలోకి పంపే వ్యర్ధా జలాల వల్లకలుషిత కాకూడదు. పైపులైన్ల నుంచి లీకేజీ లేకుండా జాగ్రత్త పడాలి. అలాగే వ్యర్ధ జాలాలు సముద్రంలోకి చేరే ముందు గార్డు పాండ్స్ లోకి వస్తాయి. వీటి లైనింగ్ తో లీకేజీ అరికట్టవచ్చు. అలాగే నీరు లోపలి తెచ్చేవి, వ్యర్ధాలు వదిలేసే నీటి పైపుల అనుసరించి వుండే ఆర్.సి.సి. కట్టుబడులకు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే, ప్లాంటు సరిహద్దుల అవతల అంతా పంట పొలాలు.
-------------------------------------------------------------------------------------------------------------------------------
3. పర్యావరణ ప్రభావ అంచనా పత్రం(E.I.A.) మరియు ఎగ్జిక్యూటివ్ సంగ్రహ సమాచారం
పర్యావరణ ప్రభావ అంచనా నిర్మాణం |
వివరాలు |
ఉపోద్ఘాతం
|
1.ప్రాజెక్ట్ ఉద్దేశ్యం 2.ప్రాజెక్ట్ గుర్తింపు, ప్రాజెక్ట్ నిర్వహించువాని వివరాలు 3.ప్రాజెక్ట్ గురి౦చినవివరణ - స్వభావం, పరిధి, ప్రాంతం, దేశానికి , ప్రాంతానికి దాని ప్రాముఖ్యం 4.ఈ ప్రాజెక్ట్ గురించి ఏ మేర పరిశీలన అవకాశం( టి.ఒ.ఆర్ ప్రకారం)
|
ప్రాజెక్ట్ వివరణ |
1.ఈ ప్రాజెక్ట్ పర్యావరణ౦లో మార్పులు కలగజేసే అవకాశం వున్న అంశాలపై వివరణ . 2.స్పష్టమైన వివరాలతో కూడిన నిర్ధారణ
4.స్కీము ప్రకారం సమర్పి౦చిన ప్రాజెక్టు వివరాలు ( పర్యావరణ ప్రభావ అంచనా కు అవసరమైన వివరాలను ఇవ్వగల డ్రాయింగులు )
|
పర్యావరణ అంచనా వివరాలు |
|
ఊహించిన పర్యావరణ ఫలితాలు మరియు పరిహార చర్యలు |
పరిశోధనల ఫలితంగా తెలుసుకున్న పర్యావరణ వివరాలు :
|
ప్రత్యామ్నాయ విధానాల విశ్లేషణ (సాంకేతికమైనవి,ప్లాంటు స్థలానికి సంబంధించినవి ) |
అన్నిటి ప్రత్యామ్నాయ వివరాలు ( ప్రత్యామ్నాయ విధానాల అవసరం వుంటే ) 1 . వివరణ 2 . దుష్ఫలితాల వివరణ 3. తలపెట్టిన పరిహార చర్యలు 4. ప్రత్యామ్నాయాల ఎంపిక
|
పర్యావరణ మానిటరింగ్ ప్రోగ్రామ్ |
చేపట్టిన పరిహార చర్యల ఉపయోగాల్ని సాంకేతికంగా పర్యవేక్షించడం లో విధానాలు కొలిచి చూడడం ఫ్రీక్వెన్సీ ప్రాంతం డేటా విశ్లేషణ షెడ్యూల్ రిపోర్టు చెయ్యడం అత్యవసర పద్ధతులు వివరణాత్మకమయిన బడ్జెట్ సేకరించిన షెడ్యూల్స్
|
అదనపు స్టడీ |
పబ్లిక్ కన్సల్టేషన్ రిస్క్ అంచనా సామాజిక ఫలితాల అంచనా |
ప్రాజెక్ట్ ప్రయోజనాలు |
మౌలిక , సామాజిక అభివృద్ధిలో మెరుగుదల ఉపాధి అవకాశాల పెరుగుదల(స్కిల్డ్,సెమి స్కిల్డ్,అ న్ స్కిల్డ్) ఇతర స్పష్టమైన ప్రయోజనాలు |
పర్యావరణ కాస్ట్ బెనిఫిట్ విశ్లేషణ |
విస్తృత పరిధిలో సిఫారసు చేసినప్పుడు |
పర్యావరణ మేనేజ్మెంట్ ప్లాను |
ఇ.ఐ.ఏ. అనుమతి లభించాక, పరిహార చర్యలకార్యాచరణ, పర్యవేక్షణ గురించి కార్యనిర్వహణ అంశాల వివరాలు . |
సారా౦శం మరియు ముగింపు (ఇది పర్యావరణ ప్రభావ అంచనా రిపోర్టు సంగ్రహమై వుండాలి .) |
ప్రాజెక్ట్ అమలుచెయ్యడంలో పూర్తి నిబద్ధత దుష్పలితాలు / నష్టాలను పూరించే చర్యల వివరణ |
ఈ ప్రాజెక్ట్ లో వున్న కన్సల్టేంట్స్ వివరణ |
కన్సల్టెంట్స్ వివరాలు; పేరు బయోడేటా కన్సల్టెన్సీ స్వభావం |
-------------------------------------------------------------------------------------------------------------
పర్యావరణ ప్రభావ అంచనా కు సంబంధించిన ఎగ్జిక్యూటివ్ సమ్మరి వివరాలు
ఇ.ఐ. ఏ. ఎగ్జిక్యుటివ్ సమ్మరి రిపోర్టు ఇ.ఐ .ఏ. పూర్తిఈ సారాంశం తో కూడిన రిపోర్టు అయి వుండాలి. 10 A 4 సైజు పేజీల దాటకుండా కుదించవచ్చు. ఇ.ఐ .ఏ. పూర్తి రిపోర్ట్ లోని ఈ క్రింది చాప్టర్ల గురించి క్లుప్తంగా వర్ణించి వుండాలి.
1.ప్రాజెక్ట్ వివరణ
2.పర్యావరణ౦ తాలూకు విశ్లేషణ
3.భవిష్యత్తులో రాగల పర్యావరణ మార్పులు మరియు అవసరమయిన పరిహార చర్యలు
4, పర్యావరణ పరిరక్షణ ప్రోగ్రాం
5.అదనపు పరిశోధనలు
6. ప్రాజెక్ట్ ప్రయోజనాలు
7 పర్యావరణ నిర్వహణ తాలూకు ప్లాన్